Friday, August 8, 2025

అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ Online లొ తెలుసుకొనె విధానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 2025లో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ‘అన్నదాత సుఖీభవ పథకం’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం, రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, పంటల విక్రయానికి సులభతరం చేసే విధానాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి కావలసిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మొదటి విడత నగదు రూ.7000/- ను విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ PM Kisan Scheme Payment ద్వారా రూ.2000/-, రాష్ట్ర ప్రభుత్వ పథకమైన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదట విడత కింద రూ.5000/- మొత్తం కలిపి రూ.7000/- నగదు విడుదలవడం జరుగుతుంది.

అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నగదు క్రెడిట్ అయ్యాయా లేదా అని మీ మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. మీ మొబైల్ లోనే ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ ఉంటే వారికి పేమెంట్ అయిందా లేదా అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా అనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ తెలుసుకొనె విధానం

Step 1 : https://annadathasukhibhava.ap.gov.in/know-your-status అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.

Step 2 : Aadhaar Number ఆధార్ నెంబర్ వద్ద రైతు యొక్క 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి పక్కనే క్యాప్చ కోడ్ దగ్గర చూపిస్తున్నటువంటి కోడ్ ని ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.

Step3: రైతు యొక్క పేరు, జిల్లా, మండలం, గ్రామం, ఈ కేవైసీ , పేమెంట్ స్టేటస్ Payment Status, బ్యాంకు వివరాలు Bank Details, క్రెడిట్ అయినా నగదు వివరాలు Amount క్రింద చుపిన విధముగా table format లొ తెలుపబడుతాయి.

Sample format of the payment staus for eligible and non eligible ని క్రింద screen shot లొ చుడవచ్చు.

Tuesday, July 29, 2025

రేషన్ కార్డు లో సభ్యుల తొలగింపు in Andhara Pradesh New Option 2025

రైస్ కార్డ్ లో సభ్యులను తొలగించడానికి ప్రభుత్వం కొత్త ఆప్షన్ ను ఇవ్వడం జరిగినది. గతంలో రేషన్ కార్డులో ఎవరైనా సభ్యులు చనిపోయిన వారు ఉంటే మాత్రమే వారిని తొలగించేందుకు అవకాశం వుండేది. కొత్తగా ఇచ్చిన options లో ఎవరైనా Migration వలసలో ఉంటారో వారిని కూడా తొలగించే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వేరే రాష్ట్రం/దేశం వాళ్ళని వివాహం చేసుకుని మైగ్రేట్ అయిన వారు, వేరే రాష్ట్రం/దేశంలోకి మైగ్రేట్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వారు, వేరే రాష్ట్రం/వేరే దేశంలో చదువు నిమిత్తం మైగ్రేట్ అయిన వారు, ఇతర కారణాలు ఉన్న వారు ఈ ఆప్షన్ సద్వినియోగం చేసుకోగలరు.

Old Workflow

➤ రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించాలి అంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తును సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి
➤ దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత రెవెన్యూ అధికారి గ్రామాల్లో VRO పట్టణాల్లో వార్డు రెవెన్యూ సెక్రటరీ WRO వారు వారి లాగిన్ లో vro /wro ఆమోదం తెలిపిన తర్వాత మండల రెవెన్యూ అధికారి MRO వారి లాగిన్ కు వెళ్తుంది
➤ మండల రెవెన్యూ అధికారి MRO గారు approval చేసిన తర్వాత మాత్రమే రైస్ కార్డ్ లో నుండి సభ్యుడు తొలగించబడుతాడు.

➤ ➤ (డిజిటల్ అసిస్టెంట్ అధికారి --> VRO / WRO --> మండల రెవెన్యూ అధికారి MRO)

New Work Flow

➤ కొత్తగా ఇచ్చిన ఆప్షన్లో రైస్ కార్డు నుండి సభ్యులను తొలిగించడానికి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వార్డు సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ➤ దరఖాస్తు చేసుకున్న తరువాత మండల రెవెన్యూ అధికారి MRO గారి లాగిన్ కి వెళ్తుంది. మండల రెవెన్యూ అధికారి MRO గారు approval చేస్తే రైస్ కార్డ్ నుండి సభ్యుడు తొలగిపోతారు.

➤ ➤ (డిజిటల్ అసిస్టెంట్ అధికారి --> మండల రెవెన్యూ అధికారి MRO)

Memeber Deletion In Rice Card Due to Migration Options

➤ ➤ Migration Type ( Outside State / Outside Country )
➤ ➤ Migration Reason ( Marriage / Employment / Education / Others )


పై options లో okati select చేసుకొని memeber deletion కి దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వలసలో వుండే వారు లేదా ఇంట్లో ఒకరు తప్పనిసరిగా రైస్ కార్డు ప్రస్తుతం ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో ఉందో అక్కడికి వెళ్లి వారి యొక్క బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఎవరినైతే వలసలో ఉన్నారు అనే కారణం చేత తీసివేయాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది .

Sunday, June 8, 2025

Andhra Pradesh - అందరికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయు విధానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న పౌరులు ఏ సర్వీస్ పొందాలన్నా, ఏ స్కీము పొందాలన్నా, ఏ లబ్ధి పొందాలన్నా ఆ పౌరుడు తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాల్సిందే అని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనెది ప్రతి కుటుంబానికి ఒక HouseHold ID Create చెయ బడుతుంది. ఇందులొ ఆ కుటుంబ సభ్యుల అందరి వివరలు వుంటయి.

హౌస్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకునే విధానం ?

➤ మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో మీ ఆధార్ నెంబర్ను తీసుకువెళ్లి NBM login లో పేరు ఉందో లేదో చెక్ చేసి చెప్తారు .
➤ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న సర్వేలలో మీ పేరు ఉన్నట్టయితే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్టు అర్థము.
➤ WhatsApp Governance లో ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మీ సచివాలయం పేరుతో సహా మీ పేరు మరియు ఇతర వివరాలు వస్తే అప్పుడు మీ పేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు అయిందని అర్థము.
➤ సచివాలయంలో యెదైన Service కొసం Apply చెసినప్పుడు మీ ఆధర్ నెంబెర్ enter చెసినప్పుడు మీ వివరములు Display ఐనప్పుడు మీరు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు అయిందని అర్థము.

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకునే విధానం

➤ మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి Digital Assistant or Ward Education and Data Processing అధికారిని ఆధార్ కార్డు, ఆ ఊరికి సంబంధించి చిరునామా ప్రూఫ్ తీసుకువెళ్లి, ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు వచ్చే ఓటీపీ చెప్పినట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరును నమోదు చేయడం లేదా కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్రియేట్ చేయడం జరుగుతుంది .

➤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా హౌస్ మ్యాపింగ్ లో పేరు నమోదు అవకాశ కల్పించింది.

➤ Click on the link CitizenEnrolment
➤ Check box ను Tick చేయండి. login పై క్లిక్ చేయండి.
➤ Aadar Authentication వద్ద checkbox check చేసి, ఎవరిని హౌస్ మాపింగ్ లో యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి, Get OTP పై క్లిక్ చేస్తే ఆధార్కు లింక్ అయినా నెంబర్ కు ఆరు అంకెల ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయండి.
➤ ఆధార్ otp verify success అయిన తరువాత ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఏజ్ ఆటోమెటిగ్గా వస్తుంది.
➤ మీ ఆధార్ వివరాల తనిఖీ చేసుకోని మిగిలిన వివరాలు పూర్తి చెయ్యాలి.
➤ తరువాత Do You Want To Add Members ? అనే ప్రశ్న ఎదురవుతుంది. దీని అర్థం కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఉన్నారా లేదా ఒకరి కన్నా ఎక్కువ ఉన్నారా అని. కుటుంబంలో ఒకరు మాత్రమే ఉంటే NO అని టిక్ చేసి కింద తెలిపిన నాలుగు ఆప్షన్లలో ఒకటిని ఎంచుకోవాలి.

➤ ➤ అవివాహితుడు మరియు విడివిడిగా నివసిస్తున్నార
➤ ➤ వితంతువు/వితంతువు
➤ ➤ ట్రాన్స్ జెండర్
➤ ➤ కుటుంబ సభ్యులు లేని ఒంటరి
➤ పై వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే హౌస్ మ్యాపింగ్ పూర్తి అవుతుంది. 24 - 48 గంటలలోపు HH మాపింగ్ లో పేరు చూపిస్తుంది. కొత్తగా సృష్టించిన హౌస్ హోల్ Id Starting MISSING ఆనే ఒక పదంతో ప్రారంభమవుతుంది.

ప్రస్తుతం House Hold ఉన్న కుటుంబంలో Add చేయు విధానం

➤ ప్రస్తుతం House Hold ఉన్న కుటుంబంలో Add చేయుటకు YES పై టిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్కు వెళ్తుంది.
➤ Enter Family Details Screen చూపిస్తుంది. ప్రస్తుతం మ్యాపింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరి కుటుంబంలో ఆడ్ అవ్వాలనుకుంటున్నారో ఆ కుటుంబంలోని సభ్యుల ఒకరి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి SEARCH పై క్లిక్ చేయాలి. ఎంటర్ చేసిన వ్యక్తి ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారో ఆ మ్యాపింగ్ ఐడి మరియు పూర్తి పేరు వస్తుంది.
➤ Do you want to add yourself to this member's household? అనే ప్రశ్న వద్ద YES అని tick చేసి Submit చేస్తే చాలు. 24 నుండి 48 గంటల్లోపు హౌస్ మ్యాపింగ్ లో పేరు యాడ్ అవుతుంది.

Please find the screen shot below




కొత్తగా హౌస్ హోల్డ్ చేయు విధానం

➤ కుటుంబంలో మీరు కొత్తగా హౌస్ హోల్డ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు అందరి ఆధారాలు ఎంటర్ చేయాలి. For Ex కుటుంబంలో మొత్తం నాలుగు మంది ఉంటే అందరి ఆధార్ నంబర్లను ఎంటర్ చేయాలి.. ( వారు ఎవరి హౌస్ హోల్డ్ లో ఉండకూడదు. ).
➤ Submit పై క్లిక్ చేయాలి. కొత్తగా సృష్టించిన హౌస్ హోల్ Id Starting MISSING ఆనే ఒక పదంతో ప్రారంభమవుతుంది.

Saturday, March 29, 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని రేషన్ కార్డ్ వినియోగదార్ల ekyc స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోనే విధానము

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని రేషన్ కార్డు వినియోగ దారు అందరు రేషన్ కార్డు EKYC చేసుకోవలి అని తెలియజేసినారు

1) రేషన్ కార్డ్ EKYC మీరు మీ ఫోన్ లోనే EKYC స్థితిని చెక్ చేసుకోవచ్చు
2) మీ గ్రామ సచివాలయం లో మీ రేషన్ నంబర్ తిసుకోని వెల్తే సచివాలయం అధికారులు వారి మొబైల్ యాప్ లో చెక్ చేసి ఎవరికీ EKYC చేయలో చెప్తారు.
3) రేషన్ డీలర్ దగ్గర కుడా EKYC పెండింగ్ లిస్ట్ వుంటూని అక్కడైనా చెక్ చేస్కోని EKYC చెయిన్చుకోవాలి.

Ration Card ఉన్నవారిలో చాలామంది AP Ration Card eKYC చేసుకోలేదు.. వెంటనే AP Ration Card eKYC చేయించు కోవాలని లేకపోతే 2025 April 1 నుంచి సరుకుల్ని పంపిణీ చేయరని అధికారులు తెలిపారు. వయసు 5 నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు AP Ration Dealers ePOS లాగిన్ లో ప్రజల వేలిముద్ర వేసి AP Ration Card eKYC పూర్తి చేసుకోవచ్చు

How to Check AP Ration Card members eKYC Status Online
మీ మొబైల్ ఫోన్లో Ration Card eKYC Status సొంతంగా ఆన్లైన్ లో చెక్ చేసుకోనే విధానము.

Open the link https://epds2.ap.gov.in/epdsAP/epds
Click on Dashboard link
Click on Rice Card Search link
Enter the Rice Card number and click submit
It will show all the rice card members details and their ekyc status.

Please check the below screen shot for reference

Thursday, March 20, 2025

PNR Full Form and Status Check in Online

PNR :: PNR stands for "Passenger Name Record".

The full form of The PNR is Passenger Name Record. It's a 10-digit unique identifier assigned to each train ticket booking, containing details about the passenger's journey.

The PNR holds information about the passenger, including their name, age, sex, and journey details like train number, date of travel, source and destination stations, class, and berth. You can use the PNR number to check the status of your train ticket booking, including whether it's confirmed, or a waiting list, or has a Reservation Against Cancellation (RAC) status. You can find the PNR number on your train ticket, typically in the top left corner. Once tiket is booked it will send a PNR Status to Your mobile number and also send it to the mail id.

You can also check from the below link
https://www.indianrail.gov.in/enquiry/PNR/PnrEnquiry.html?locale=en

Some of the full forms of train ticket related are shown below.

CNF / Confirmed Confirmed (Coach/Berth number will be available after chart preparation)
RAC Reservation Against Cancellation
WL # Waiting List Number
RLWL Remote Location Wait List
GNWL General Wait List
PQWL Pooled Quota Wait List
REGRET/WL No More Booking Permitted
TQWL Tatkal Quota Waitlist
TDR Passenger has filed TDR