ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘స్త్రీ శక్తి’ పేరిట 15 ఆగష్టు 2025 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బస్సు ప్రయాణం 5 కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పల్లె వెలుగు
ఆల్ట్రా పల్లెవెలుగు
సిటీ ఆర్డినరీ
మెట్రో ఎక్స్‌ప్రెస్
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు.
ఏఏ బుస్సు లో ప్రయాణం వుండదు
నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు.
Zero Ticket ( జీరో టికెట్ )
జీరో టికెట్ అంటే కండక్టర్ వద్ద మనం టికెట్ తీసుకున్నప్పుడు దానిలో మనం ప్రయాణం చేయడానికి ఎంత చార్జి పడుతుంది చూపిస్తుంది మరియు ప్రభుత్వం రాయితీ మరియు మనం చెల్లించవలసిన అమౌంట్ చూపిస్తుంది. ఈ జీరో టికెట్ లో స్త్రీ శక్తి కింద చెల్లించవలసిన అమౌంట్ Zero అని చూపిస్తుంది. అందువలన బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వద్ద Zero Ticket ( జీరో టికెట్ ) ను తప్పనిసరిగా తీసుకోవాలి. జీరో టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం చేయడానికి లేదు అలా ప్రయాణించిన వారు తప్పనిసరిగా ఫైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. జీరో టికెట్ చేతికి వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఉచిత ప్రయాణం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అవడం జరుగుతుంది. zero టికెట్ కు తప్పనిసరిగా మీ వద్ద ప్రభుత్వ గుర్తింపు ఆమోదం పొందిన గుర్తింపు ఐడి card అనగాఆధార్ కార్డులేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా రేషన్ కార్డు లేదా ప్రభుత్వం తెలిపిన డాక్యుమెంట్లు ఉండాలి.
జీరో టికెట్ sample format
బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
No comments:
Post a Comment