Friday, August 8, 2025

అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ Online లొ తెలుసుకొనె విధానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 2025లో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ‘అన్నదాత సుఖీభవ పథకం’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం, రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, పంటల విక్రయానికి సులభతరం చేసే విధానాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి కావలసిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మొదటి విడత నగదు రూ.7000/- ను విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ PM Kisan Scheme Payment ద్వారా రూ.2000/-, రాష్ట్ర ప్రభుత్వ పథకమైన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదట విడత కింద రూ.5000/- మొత్తం కలిపి రూ.7000/- నగదు విడుదలవడం జరుగుతుంది.

అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నగదు క్రెడిట్ అయ్యాయా లేదా అని మీ మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. మీ మొబైల్ లోనే ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ ఉంటే వారికి పేమెంట్ అయిందా లేదా అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా అనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ తెలుసుకొనె విధానం

Step 1 : https://annadathasukhibhava.ap.gov.in/know-your-status అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.

Step 2 : Aadhaar Number ఆధార్ నెంబర్ వద్ద రైతు యొక్క 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి పక్కనే క్యాప్చ కోడ్ దగ్గర చూపిస్తున్నటువంటి కోడ్ ని ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.

Step3: రైతు యొక్క పేరు, జిల్లా, మండలం, గ్రామం, ఈ కేవైసీ , పేమెంట్ స్టేటస్ Payment Status, బ్యాంకు వివరాలు Bank Details, క్రెడిట్ అయినా నగదు వివరాలు Amount క్రింద చుపిన విధముగా table format లొ తెలుపబడుతాయి.

Sample format of the payment staus for eligible and non eligible ని క్రింద screen shot లొ చుడవచ్చు.

No comments: