Saturday, February 10, 2024

స్టీల్ వాటర్ బాటిల్స్ కంపు కొడుతున్నాయా? Tips for washing steel water bottles


మనం ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిల్‌ కచ్చితంగా క్యారీ చేయాల్సిందే. జీమ్‌, ఆఫీస్‌, దురప్రయాణాలకు వెళ్లినప్పుడు వాటర్‌ బాటిల్‌ ఉండాల్సిందే. చాలా మంది వాటర్‌ బాటిల్‌ను సరిగ్గా క్లీన్‌ చేసుకోరు. మీరు బాటిల్‌లో వాటర్‌ క్యారీ చేస్తుంటే.. వారానికి ఒక్కసారైనా డీప్‌‌ క్లీన్‌ చేయాలి. మీరు బాటిల్‌లో పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకెళ్తుంటే.. దాన్ని ప్రతి రోజూ డీప్‌ క్లీన్‌ చేయడం మంచిది. అయితే, పదే పదే వాడటంతో ఈ వాటర్ బాటిల్స్ ఒక్కోసారి దుర్వాసన వెదజల్లడం ప్రారంభిస్తాయి.

మీ వాటర్‌ బాటిల్‌ ఇలా క్లీన్‌ చేస్తే.. బ్యాక్టీరియా నాశనం అవుతుంది

మీ వాటర్‌ బాటిల్‌లో గోరు వెచ్చని నీరు పోసి దానిలో సబ్బు వేయండి. ఆ తర్వాత దాన్ని షేక్‌ చేయండి. ఇప్పుడు వాటర్‌ బాటిల్‌ క్లీనింగ్‌ బ్రష్‌తో శుభ్రం చేయండి. ఆ తర్వాత బాటిల్‌ లోపల ఉన్న నీరు పారబోసి. ఫ్రెష్‌ వాటర్‌తో ముడు, నాలుగు సార్లు వాష్‌ చేసి, డ్రై చేయండి. మీ దగ్గర ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ ఉంటే, దానిని వేడి నీటితో నింపి 10 నిమిషాలు అలాగే ఉంచండి. అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది.

వెనిగర్, వేడి నీళ్లు..

మరకలు, వాసన వదలకుండా ఉంటే వెనిగర్ మిశ్రమాన్ని కూడా వాడొచ్చు. వైట్ వెనిగర్‌కు నీటిని కలిపి అందులో బాటిల్‌ను రాత్రంతా నానబెట్టాలి. వెనిగర్ లోని యాసిడ్ లక్షణాల కారణంగా ఎంతటి దుర్వాసన అయినా ఇట్టే వదిలిపోతుంది.

బేకింగ్‌ సోడా బాటిల్‌లోని బ్యాక్టీరియాను చంపుతుంది. బాటిల్‌లో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి వేడినీళ్లు పోయండి. ఇప్పుడు బాటిల్‌ క్యాప్‌ పెట్టి షేక్‌ చేయండి. ఆ తర్వాత మూత తీసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత, దానిలోని నీరు పారబోసి, ఫ్రెష్‌ వాటర్‌తో వాష్‌ చేయండి.

నిమ్మరసంలో కాస్తంత ఉప్పు వేసి అందులో స్క్రబ్ ముంచి బాటిల్‌ను శుభ్రపరచాలని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు. దీంతో కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. నిమ్మరసంలోని యాసిడ్ లక్షణాలకు ఉప్పు కూడా తోడవడంతో జిడ్డు, దుర్వాసనా ఈజీగా వదిలిపోతాయట.

No comments: