Wednesday, September 20, 2023

PM Vishwakarma Yojana Scheme - PM విశ్వకర్మ పథకం

భారతదేశం లోని గ్రామీణ ప్రాంతాల లో మరియు పట్టణ ప్రాంతాల లో సాంప్రదాయిక చేతి వృత్తి శ్రమికులకు, హస్తకళల నిపుణులకు అండగా నిలవడం కోసం ఉద్దేశించిన నూతన కేంద్ర పథకమే ‘పిఎమ్ విశ్వకర్మ’ పథకం. దీనిని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ సెప్టెంబర్ 17, 2023.

PM విశ్వకర్మ పథకం ఎవరికీ వర్తిస్తుంది :

1. వడ్రంగులు
2. పడవల తయారీదారులు
3. ఆయుధ / కవచ తయారీదారులు
4. కమ్మరులు
5. సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు
6. తాళాల తయారీదారులు
7. బంగారం పని ని చేసే వారు
8. కుమ్మరులు
9. శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు
10. చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు
11. తాపీ పనివారు
12. గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు
13. కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు)
14. క్షురకులు (నాయీ వృత్తిదారులు)
15. మాలలు అల్లే వారు
16. రజకులు
17. దర్జీలు మరియు
18. చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు..

పీఎం విశ్వకర్మ పథకం కు అర్హతలు ఏమిటి ?

కనీస వయసు రిజిస్ట్రేషన్ చేయు సమయానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
కుటుంబలో ఒకరికి మాత్రమే ఈ పీఎం విశ్వకర్మ పథకం వర్తిస్తుంది.
18 సాంప్రదాయక చేతివృత్తులలో ఒకటి అయినా చేసుకునే వారు అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేయు సమయానికి వృత్తిలో ఉండి ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగులు , వారి కుటుంబ సభ్యులు అంటే భర్త , భార్య , పెళ్లి కానీ పిల్లలు ఈ పథకానికి అనర్హుల.
గత 5 సంవత్సరాలలో PMEGP , PM SVANIDHI , MUDRA వంటి వాటిలో లోన్ తీసుకొని ఉండకూడదు . ఒకవేళ తీసుకున్న ఆ లోన్ చెల్లించి ఉంటె వారు అర్హులు .

Application process కి కావాల్సినవి : Link

ఆధార్ కార్డు.
ఆధార్ కార్డు కి లింక్ అయిన Mobile నెంబర్.
Apply చేసేటప్పుడు OTP verification మరియు బయోమెట్రిక్ verification కూడా ఉంటుంది..
కాస్ట్ మరియు income సర్టిఫికెట్స్ ( అడిగే అవకాశం ఉంది.)
బ్యాంకు అకౌంట్.
రేషన్ కార్డు..

Second step :

Registration CSC సెంటర్స్ మరియు గ్రామ /వార్డు సచివాలయాల్లో కూడాApply చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
Register అయిన వారికీ 5 రోజుల Basic ట్రైనింగ్ ఉంటుంది..రోజుకి 500 ఇస్తారు..
తర్వాత 15 రోజుల Advanced ట్రైనింగ్ ఉంటుంది..ఆ తర్వాత Tool కిట్ కోసం 15,000 ఇవ్వడం జరుగుతుంది..

Loan వివరాలు :

5% వడ్డీ రేటుతో మీకు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది..
అమౌంట్ నిర్నీత installments లో చెల్లించినట్లు అయితే మీకు మరల loan 2 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది..

No comments: