జగనన్న ఆరోగ్య సురక్ష
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 30 2023 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఆరోగ్య సంబంధిత పధకాలు పై అవగాహన పెంచడానికి రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) / విలేజ్ హెల్త్ క్లినిక్ (VHC) పరిధిలో వైద్య శిబిరాలను నిర్వహించేందుకు రూపొందించబడిన ఒక సమగ్ర కార్యక్రమం.
వాలంటీర్లు మరియు ANM లు చేయవలసిన పనులు :
వాలంటీర్స్ మరియు ANM లు ప్రతి ఇంటికి వెళ్లి GSWS వాలంటీర్ App లో ఇచ్చిన Questions తో సర్వే చేయాలి. మరియు సర్వే సమయంలో photo తీసి అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని App లో నమోదు చేయాలి. Tokens generate చేసి వారిని క్యాంపు రోజు క్యాంపు సచివాలయం వద్దకు తీసుకురావాలి.
జగనన్న ఆరోగ్య సురక్ష బ్రోచర్లు పంపిణీ చేయాలి.
ఆరోగ్య శ్రీ పథకానికి సంబందించి వినియోగం మరియు ప్రయోజనాల పైన ప్రజలకు అవగాహన కల్పించాలి.
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఎప్పటి నుంచి నిర్వహిస్తారు?
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను పాఠశాల ప్రాంగణంలో కానీ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిసరాలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మరియు సన్నద్ధత అంతా కూడా సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది
ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.
తొలి ఆరోగ్య సురక్ష క్యాంపును సెప్టెంబర్ 30 2023 న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది.
No comments:
Post a Comment