Nazeer Basha Shaik
A Blog for useful information. Email: nazeerbasha.mca@gmail.com.
Monday, September 15, 2025
AP Vahana Mitra Scheme 2025 – Scheme to provide ₹15,000 Financial Help for Auto & Cab Drivers
దరఖాస్తుదారులకు కొన్ని అర్హతలు ఉండాలి
➤ లబ్ధిదారులకు ఏపీలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) ఉండాలి.
➤ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోనే రిజిస్టర్ అయి ఉండాలి
➤ ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి.
➤ మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్‌లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి.అయితే ఆటో రిక్షా విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే ఈ ఒక్క సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు.కానీ, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
➤ వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
➤ Rent లేదా Lease పై తీసుకున్న వాహనాలు అనర్హులు.
LAND Related
➤ మాగాణి అయితే 3 ఎకరాలు, లోపు భూమి ఉండాలి
➤ మెట్ట అయితే 10 ఎకరాల లోపు భూమి ఉండాలి.
➤ మాగాణి , మెట్ట రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి
➤ పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.
Other
➤ ఇంటి విద్యుత్తు వినియోగం (Power consumption) నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దీని కోసం దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటును లెక్కిస్తారు.
➤ Aadhar Card, White Ration Card ఉండాలి.
➤ దరఖాస్తుదారు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటే ఈ పథకానికి అనర్హులు. కానీ, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది
➤ ఈ పథకం ప్యాసింజర్ ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ సొంతంగా కలిగిన వారు మాత్రమే అర్హులు. ఒక కుటుంబానికి ఒకే వాహనం ఉన్నా, బహువాహనాలు ఉన్నా ఒక్క యజమానికే సాయం లభిస్తుంది
గ్రామ, వార్డు సచివాలయాల దరఖాస్తు చేసుకోవడానికి
➤ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం (జీఎస్‌డబ్ల్యూఎస్‌డీ) సెప్టెంబర్ 17 2025 నాటికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తుంది.
➤ కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19 2025 వరకు అవకాశం ఉంటుంది.
➤ సెప్టెంబర్ 22 2025 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు.
➤ తర్వాత తుది జాబితా సెప్టెంబర్ 24కు సిద్ధమవుతుంది.లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్‌ల వారీగా జీఎస్‌డబ్ల్యూఎస్ విభాగం 24 నాటికి రవాణా శాఖకు పంపుతుంది.
➤ 2025 అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు.
ఈ పధనికి సంభంధించిన పాత లబ్ధిదారుల డేటా nbm portal Digital Assistant login నందు excel లో Download చెసుకొవచు.
Friday, September 12, 2025
File is not eligible for processing as per the FIFO Rules
For example if you have 10 items in the inventory queue and the order the items are like 1,2.. 10 then the the first item 1 should be sold out and then only 2nd item will be sold out.. like this items are sold from 1,2... to 10..
So any error message coming like this first check the items executed order like from first inventory item is sold or not. If not sold then sold the item first and then go for the item 2..
Thursday, September 11, 2025
Gmail - How to change your phone number linked to the Gmail Account
Steps to Change Your Gmail Phone Number.
1) Login into your Gmail Account and then open the Google Account Settings i.e from the profile icon in the Gamil select the option Manage your Google Account.
2) Select the Personal Info option from the left side menu.
3) Scroll down to the Contact Info section and then click on the Phone number.
4) It will show the phone numbers linked to the Gmail Account.
5) Click on the number you want to change and click on the Edit option. Enter the new number and it will send the verification code to the new number.
6) Enter the Code send to the New mobile number and verify to confirm the new number.
Note: In this page preferences section, Account security and Password reset option enable to get the password reset code to this number.
Please find the screen shot below for the reference
Monday, August 18, 2025
Andhra Pradesh Grama Ward Sachivalayam Koushalam Survey 2025 Process
మొదట గ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ మొబైల్ యాప్ ను play store ద్వారా డౌన్లోడ్ చెసుకొవాలి. మీ దగ్గర పాత GSWS employee mobile app వుంటె దానిని ముందుగా uninstall చెయలి. ఎందుకంటె పాత GSWS employee mobile app లొ సర్వే చేస్తున్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కి కేవలం ITI, Diploma, Graduation,Post Graduation Diploma, PostGraduation, PHD చదువుకున్న options మత్రమె కనిపిస్తున్నయి. GSWS employee mobile app కొత్త version 9.0 లొ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కి ITI, Diploma, Graduation,Post Graduation Diploma, PostGraduation, PHD తొ పాటు అదనంగా Intermediate, 10th Class, Below 10th Class options కూడ కనిపిస్తయి.
Steps to Start Survey
➤ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లాగిన్ అయిన తరువత Koushalam module ను ఒపెన్ చెయలి
➤ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది cluster ని select చెసుకొంటె వారి పరిధిలొని సర్వే చెయవలసిని names కనిపిస్తాయి.
➤ సర్వే చెయవలసిన పెరు మీద క్లిక్ చెయగానె authentication అడుగుతుంది. citizen బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా ఓటీపీ లొ ఒక ద్వారా సర్వే ప్రారంభించాల్సి ఉంటుంది.
➤ సర్వేలో ఫొనె నుంబెర్ మరియు mail id ను OTP తొ authentication చెయవలసి వుంటుంది. maild id కి మత్రమె it will ask question like validate with OTP or without OTP అనె రెండు options కనిపిస్తయి. User with OTP otpion select చెసుకొంతె mail కు వచిన OTP enter చెయవలసి వుంటుంది.
➤ Otp validation అయిన తరువాత ఎన్ని languages తెలుసు అని అడుగుతుంది. select the options from the list of languages and click on confim button.
➤ స్పెషలైజేషన్ ఏమిటి వచ్చిన మార్కులు percentage లేదా జిపిఏ ఎంత మరియు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అని అడుగుతుంది. పాస్ అయితె పాసైన సర్టిఫికెట్ అప్లొడ్ చెయవలసి వుంటుంది. పాసైన సర్టిఫికెట్ ముందుగానే సర్వే చేస్తున్న వారి మొబైల్ వాట్సాప్ కు పంపించినట్టయితే వారు వటిని వారి mobile లొ download చెసుకొంటె నేరుగా గ్యాలరీ లోకి వెళ్లి అప్లోడ్ చేస్తే త్వరగా అవుతుంది. వారు చదివిన location select చెసుకొవలి.. within ap, outside ap or outside india..
➤ Within ap ఐథె district select చెసుకొని కాలెజి select చెసుకొవలి. కాలేజీ పేరు సెట్ చేసే సమయంలో నేరుగా కాలేజీ పేరుని search చేస్తే సరిపోతుంది. అలగె చదివిన కోర్స్ వివరాలు కూడా నేరుగా చదివిన కోర్సులో ఏదైనా ఒక Word ని Search చేసినట్లయితే సంబంధిత పేరుతో ఉన్న కోర్సు లన్ని వస్తాయి వచిన options నుంది course ని select చేస్తే సరిపోతుంది.
➤ ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలు ఉంటే వాటిని కూడా నమోదు చేయవచ్చు. అప్పుడు మరల పైన వివరాలన్నీ కూడా అడుగుతాయి. పాత GSWS employee mobile app లొ సర్వే చేస్తున్నప్పుడు వారు ఏదైనా కోర్సు అనగా డిగ్రీ, బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇతర పై చదలు చదువుతున్నట్లయితే వాటిని తెలియజెయదనికి option లెదు కాని ప్రస్తుతం ఏదైనా కోర్సు అనగా డిగ్రీ, బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇతర పై చదలు చదువుతున్నట్లయితే వాటిని తెలియజేస్తూ ప్రస్తుతం చదువుతున్నారని లెద complete అయ్యింది అని తెలియజెయదనికి కొత్త version లొ అప్డేట్ చెయడము జరిగింది.
➤ User pursing or completed అనె option select చెసుకొవలి.
➤ Pursing options select చెసుకొంతె చదివె కొర్సును select చెసుకొంటె సరిపొతుంది. Certificates అప్లోడ్ చేయాల్సిన అవసరం వుండదు.
➤ అన్ని details fill చెసిన తరువాత submit button ను క్లిక్ చెయలి. submit అయిన తరువాత submitted successfully అనె message వస్తుంది.
Tuesday, August 12, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉచిత బస్సు పథకం.. మార్గదర్శకాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘స్త్రీ శక్తి’ పేరిట 15 ఆగష్టు 2025 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బస్సు ప్రయాణం 5 కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పల్లె వెలుగు
ఆల్ట్రా పల్లెవెలుగు
సిటీ ఆర్డినరీ
మెట్రో ఎక్స్‌ప్రెస్
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు.
ఏఏ బుస్సు లో ప్రయాణం వుండదు
నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు.
Zero Ticket ( జీరో టికెట్ )
జీరో టికెట్ అంటే కండక్టర్ వద్ద మనం టికెట్ తీసుకున్నప్పుడు దానిలో మనం ప్రయాణం చేయడానికి ఎంత చార్జి పడుతుంది చూపిస్తుంది మరియు ప్రభుత్వం రాయితీ మరియు మనం చెల్లించవలసిన అమౌంట్ చూపిస్తుంది. ఈ జీరో టికెట్ లో స్త్రీ శక్తి కింద చెల్లించవలసిన అమౌంట్ Zero అని చూపిస్తుంది. అందువలన బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వద్ద Zero Ticket ( జీరో టికెట్ ) ను తప్పనిసరిగా తీసుకోవాలి. జీరో టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం చేయడానికి లేదు అలా ప్రయాణించిన వారు తప్పనిసరిగా ఫైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. జీరో టికెట్ చేతికి వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఉచిత ప్రయాణం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అవడం జరుగుతుంది. zero టికెట్ కు తప్పనిసరిగా మీ వద్ద ప్రభుత్వ గుర్తింపు ఆమోదం పొందిన గుర్తింపు ఐడి card అనగాఆధార్ కార్డులేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా రేషన్ కార్డు లేదా ప్రభుత్వం తెలిపిన డాక్యుమెంట్లు ఉండాలి.
జీరో టికెట్ sample format
బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Friday, August 8, 2025
అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ Online లొ తెలుసుకొనె విధానం
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మొదటి విడత నగదు రూ.7000/- ను విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ PM Kisan Scheme Payment ద్వారా రూ.2000/-, రాష్ట్ర ప్రభుత్వ పథకమైన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదట విడత కింద రూ.5000/- మొత్తం కలిపి రూ.7000/- నగదు విడుదలవడం జరుగుతుంది.
అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నగదు క్రెడిట్ అయ్యాయా లేదా అని మీ మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. మీ మొబైల్ లోనే ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ ఉంటే వారికి పేమెంట్ అయిందా లేదా అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా అనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు.
అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ తెలుసుకొనె విధానం
Step 1 : https://annadathasukhibhava.ap.gov.in/know-your-status అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
Step 2 : Aadhaar Number ఆధార్ నెంబర్ వద్ద రైతు యొక్క 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి పక్కనే క్యాప్చ కోడ్ దగ్గర చూపిస్తున్నటువంటి కోడ్ ని ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.
Step3: రైతు యొక్క పేరు, జిల్లా, మండలం, గ్రామం, ఈ కేవైసీ , పేమెంట్ స్టేటస్ Payment Status, బ్యాంకు వివరాలు Bank Details, క్రెడిట్ అయినా నగదు వివరాలు Amount క్రింద చుపిన విధముగా table format లొ తెలుపబడుతాయి.
Sample format of the payment staus for eligible and non eligible ని క్రింద screen shot లొ చుడవచ్చు.
Tuesday, July 29, 2025
రేషన్ కార్డు లో సభ్యుల తొలగింపు in Andhara Pradesh New Option 2025
Old Workflow
➤ రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించాలి అంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తును సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి
➤ దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత రెవెన్యూ అధికారి గ్రామాల్లో VRO పట్టణాల్లో వార్డు రెవెన్యూ సెక్రటరీ WRO వారు వారి లాగిన్ లో vro /wro ఆమోదం తెలిపిన తర్వాత మండల రెవెన్యూ అధికారి MRO వారి లాగిన్ కు వెళ్తుంది
➤ మండల రెవెన్యూ అధికారి MRO గారు approval చేసిన తర్వాత మాత్రమే రైస్ కార్డ్ లో నుండి సభ్యుడు తొలగించబడుతాడు.
➤ ➤ (డిజిటల్ అసిస్టెంట్ అధికారి --> VRO / WRO --> మండల రెవెన్యూ అధికారి MRO)
New Work Flow
➤ కొత్తగా ఇచ్చిన ఆప్షన్లో రైస్ కార్డు నుండి సభ్యులను తొలిగించడానికి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వార్డు సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ➤ దరఖాస్తు చేసుకున్న తరువాత మండల రెవెన్యూ అధికారి MRO గారి లాగిన్ కి వెళ్తుంది. మండల రెవెన్యూ అధికారి MRO గారు approval చేస్తే రైస్ కార్డ్ నుండి సభ్యుడు తొలగిపోతారు.
➤ ➤ (డిజిటల్ అసిస్టెంట్ అధికారి --> మండల రెవెన్యూ అధికారి MRO)
Memeber Deletion In Rice Card Due to Migration Options
➤ ➤ Migration Type ( Outside State / Outside Country )
➤ ➤ Migration Reason ( Marriage / Employment / Education / Others )
పై options లో okati select చేసుకొని memeber deletion కి దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వలసలో వుండే వారు లేదా ఇంట్లో ఒకరు తప్పనిసరిగా రైస్ కార్డు ప్రస్తుతం ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో ఉందో అక్కడికి వెళ్లి వారి యొక్క బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఎవరినైతే వలసలో ఉన్నారు అనే కారణం చేత తీసివేయాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది .