Thursday, December 7, 2023

ఆడుదాం ఆంధ్ర సర్వే ను చేయు విధానము - Aadudam Andhra Survey by Grama Ward Volunteers

ఆడుదాం ఆంధ్ర లో citizens registration ఇప్పటి వరకు online website లొ చెసారు. ఇప్పుఢు Government గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేయుటకు సిద్ధమైనది. అందులో భాగంగా వాలంటీర్ వారి GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో కొత్తగా "ఆడుదాం ఆంధ్ర" అనే ఆప్షన్ ఇవ్వడం జరుగును.

వాలంటీర్లు ఆడదాం ఆంధ్ర సర్వే చేయు విధానము :

➤ వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన GSWS Volunteer మొబైల్ యాప్ install చేసుకోవాలి.
➤ గ్రామా వార్డు వాలంటీర్ యొక్క CFMS ID (in old app it is with aadhar number)ఎంటర్ చేసి Biometric /Face / Irish ద్వారా లాగిన్ అవ్వాలి. In HOME Page "ఆడుదాం ఆంధ్రా" అనే option సెలెక్ట్ చేయాలి. వాలంటీరు పేరు, క్లస్టర్ పరిధిలోని మొత్తం సభ్యుల సంఖ్య, పూర్తి అయిన సభ్యుల సంఖ్య ,పెండింగ్ లో ఉన్న సభ్యుల సంఖ్య ప్రత్యేకంగా కనిపిస్తాయి.



గమనిక: ఆటలలో పాల్గొనడానికి సభ్యుల వయస్సు 15 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ప్రేక్షకులు పరిగణించాల్సిన అవసరం ఉంది.

➤ పెండింగ్ అని ఉన్నవి అన్నీ కూడా సర్వే చేయవలసి ఉంటుంది. పేరు పై క్లిక్ చేసిన వెంటనే నియోజవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతి యొక్క వివరములు క్రికెట్,వాలీబాల్, కబడ్డీ,ఖో ఖో మరియు బాడ్మింటన్ క్రీడల వారీగా చూపిస్తుంది.

➤ 1వ ప్రశ్నలో కనిపిస్తున్న ఆటల్లో పోటీ ఉంటుంది, 2వ ప్రశ్నలో కనిపిస్తున్న ఆటలు పోటీ లేనివి. పౌరులు ఆటలు ఆడటానికి ఆశక్తి చూపకపోతే, ప్రేక్షకులుగా పాల్గొనేందుకు 3వ ప్రశ్నను ఎంచుకోవాలి


➤ 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే దిగువ ప్రశ్నవళి కనిపిస్తుంది. పౌరుణ్ని ప్రేక్షకుడిగా ఎంచుకున్న అనంతరం సబ్మిట్ button పై క్లిక్ చేయండి.


➤ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత చివరగా Submit పై టిక్ చేయాలి.అలా చేసిన తరువాత Completed గా మారుతుంది .

సర్వే చేయు వాలంటీర్లకు సూచనలు :

➤ సర్వేలో భాగంగా వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి సర్వేను పూర్తి చేయవలసి ఉంటుంది.
➤ 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసుగల వారు ప్లేయర్లుగా రిజిస్టర్ చేయుటకు అర్హులు.
➤ 8 సంవత్సరాల పైబడిన వారు అందరూ కూడా ప్రేక్షకులుగా రిజిస్టర్ చేయుటకు అర్హులు.
➤ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు ఆడదామా ఆంద్ర కరపత్రాలు పంపిణీ చేయడం జరుగును. వాలంటీర్లు సర్వే చేయ సమయంలో కరపత్రాలను ప్రతి ఇంటికి అందించవలసి ఉంటుంది.

No comments: