Tuesday, July 29, 2025

రేషన్ కార్డు లో సభ్యుల తొలగింపు in Andhara Pradesh New Option 2025

రైస్ కార్డ్ లో సభ్యులను తొలగించడానికి ప్రభుత్వం కొత్త ఆప్షన్ ను ఇవ్వడం జరిగినది. గతంలో రేషన్ కార్డులో ఎవరైనా సభ్యులు చనిపోయిన వారు ఉంటే మాత్రమే వారిని తొలగించేందుకు అవకాశం వుండేది. కొత్తగా ఇచ్చిన options లో ఎవరైనా Migration వలసలో ఉంటారో వారిని కూడా తొలగించే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వేరే రాష్ట్రం/దేశం వాళ్ళని వివాహం చేసుకుని మైగ్రేట్ అయిన వారు, వేరే రాష్ట్రం/దేశంలోకి మైగ్రేట్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వారు, వేరే రాష్ట్రం/వేరే దేశంలో చదువు నిమిత్తం మైగ్రేట్ అయిన వారు, ఇతర కారణాలు ఉన్న వారు ఈ ఆప్షన్ సద్వినియోగం చేసుకోగలరు.

Old Workflow

➤ రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించాలి అంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తును సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి
➤ దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత రెవెన్యూ అధికారి గ్రామాల్లో VRO పట్టణాల్లో వార్డు రెవెన్యూ సెక్రటరీ WRO వారు వారి లాగిన్ లో vro /wro ఆమోదం తెలిపిన తర్వాత మండల రెవెన్యూ అధికారి MRO వారి లాగిన్ కు వెళ్తుంది
➤ మండల రెవెన్యూ అధికారి MRO గారు approval చేసిన తర్వాత మాత్రమే రైస్ కార్డ్ లో నుండి సభ్యుడు తొలగించబడుతాడు.

➤ ➤ (డిజిటల్ అసిస్టెంట్ అధికారి --> VRO / WRO --> మండల రెవెన్యూ అధికారి MRO)

New Work Flow

➤ కొత్తగా ఇచ్చిన ఆప్షన్లో రైస్ కార్డు నుండి సభ్యులను తొలిగించడానికి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వార్డు సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ➤ దరఖాస్తు చేసుకున్న తరువాత మండల రెవెన్యూ అధికారి MRO గారి లాగిన్ కి వెళ్తుంది. మండల రెవెన్యూ అధికారి MRO గారు approval చేస్తే రైస్ కార్డ్ నుండి సభ్యుడు తొలగిపోతారు.

➤ ➤ (డిజిటల్ అసిస్టెంట్ అధికారి --> మండల రెవెన్యూ అధికారి MRO)

Memeber Deletion In Rice Card Due to Migration Options

➤ ➤ Migration Type ( Outside State / Outside Country )
➤ ➤ Migration Reason ( Marriage / Employment / Education / Others )


పై options లో okati select చేసుకొని memeber deletion కి దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వలసలో వుండే వారు లేదా ఇంట్లో ఒకరు తప్పనిసరిగా రైస్ కార్డు ప్రస్తుతం ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో ఉందో అక్కడికి వెళ్లి వారి యొక్క బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఎవరినైతే వలసలో ఉన్నారు అనే కారణం చేత తీసివేయాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది .