Sunday, November 24, 2024

NPCI Link Status Checking Process and NPCI Activation Process..

NPCI stands for National Payments Corporation of India.

NPCI మ్యాపర్ అనేది నిర్దిష్ట బ్యాంక్‌తో లింక్ చేయబడిన ఆధార్ నంబర్‌ల రిపోజిటరీ మరియు గమ్యస్థాన బ్యాంకులకు ఆధార్ ఆధారిత చెల్లింపు లావాదేవీలను రూట్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఏ పథకానికి సంబంధించిన నగదు బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలి అంటే తప్పనిసరిగా లబ్ధిదారునికి NPCI లింకు అయి ఉండాలి. బ్యాంకు ఎకౌంటు నెంబర్కు ఆధార్ నెంబరు లింక్ అయి ఉన్నట్లయితే దానిని NPCI లింక్ అయినది అని అంటారు లేదా NPCI Active లొ ఉంది అని అంటారు. అదే లింక్ లేకపోతే NPCI Inactive లొ ఉంది అని అంటారు.

NPCI Status ఎలా తెలుసుకోవాలి.

Process 1:

➤ ముందుగ ఆధర్ లింక్ ను ఒపెన్ చెయాలి.
➤ Login పై క్లిక్ చేయండి .
➤ Aadar Number , Captcha Code ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి .
➤ Bank Seeding Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .
➤ "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ - ఆధార్ లింక్ అయినట్టు.
➤ Bank Seeding Status - Active లొ ఉంటే లింక్ అయి నట్టు అర్థము.



Process 2:

➤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల వారీగా NPCI Inactive లొ ఉన్న లబ్ధిదారుల జాబితా క్లస్టర్ల వారీగా విడుదల చేయడం జరిగినది. సచివాలయాన్ని సందర్శించి మీ పేరు అoదులో ఉందో లేదా తెలుసుకోవచ్చు.

Process 3:

➤ సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి అధికారులైన DA / WEA / WWDS / WEDPS వారి NBM లాగిన్ లో కూడా NPCI లింక్ ACTIVE లొ ఉందో లేదా తెలుసుకోవచ్చు.

NPCI Inactive ఉంటె ఎం చేయాలి ?

ఎటువంటి బ్యాంకు ఖాతా లేని వారికి : ప్రభుత్వ బ్యాంకు / పోస్టల్ బ్యాంకు లొ కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోవడం - తద్వారా NPCI లింక్ చేయటం

గతంలో ఖాతా ఉన్నవారికి : బ్యాంకుకు వెళ్లి ఇదివరకే ఉన్న బ్యాంకు ఖాతాకు ఆధార నెంబర్ NPCI లింక్ చేసుకోవడం.

You can also check the same in the below YouTube Video